భార‌త‌ర‌త్న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 63వ మ‌హా ప‌రినిర్వ‌హ‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌లు ఈ రోజు ఆయ‌న స్మృతికి ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నారు.

భారత రత్న డాక్టర్ B.R. అంబెడ్కర్ 63వ మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా – దేశ ప్రజలు – ఆయనకు – ఈ రోజు – నివాళులర్పిస్తున్నారు.   పార్లమెంటు భవన సముదాయంలోని సంసద్ భవన్ ముందు పచ్చిక మైదానంలో ఉన్న – బాబా సాహెబ్ విగ్రహం వద్ద – రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ – పుష్పాంజలి ఘటిస్తారు.   భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబెడ్కర్ కు – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర ప్రముఖులు కూడా – నివాళులర్పిస్తారు.    సామాజికన్యాయం,  సాధికారత శాఖ కేంద్రమంత్రి డాక్టర్ థావర్ చంద్ గెహ్లాట్, సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రులు రాందాస్ అథవాలే, క్రిషన్ పాల్ గుర్జార్, విజయ్ సంప్లా ప్రభృతులు కూడా –  బాబా సాహెబ్ కు పుష్పాంజలి ఘటిస్తారు.   సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కింద పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ – అంబెడ్కర్ ఫౌండేషన్ – ఈ సందర్భంగా – ఒక కార్యక్రమాన్ని – ఏర్పాటు చేసింది.   లౌకికవాదం నేపథ్యంలో ఏర్పాటు చేసిన – రెండు రోజుల పెయింటింగ్స్ ప్రదర్శన – నిన్న – ముంబాయి లోని చైత్య భూమి వద్ద – ప్రారంభమైంది.   ప్రతీ సంవత్సరం – ఆయన వర్ధంతి రోజున – దేశంలోని వివిధ ప్రాంతాల నుండి – లక్షలాదిగా – డాక్టర్ అంబెడ్కర్ అనుచరులు – చైత్య భూమిని – సందర్శిస్తారు.   ప్రమోద్ రాంటెక్, ప్రకాష్ భిసే, దిలీప్ బధే, ఫరూక్ నాడాఫ్ తో సహా పలువురు ప్రముఖ చిత్రకారుల 30 పెయింటింగ్స్ ను – ఇక్కడ – ప్రదర్శనలో ఉంచారు.