భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న పురుషుల హాకీ ప్ర‌పంచ క‌ప్ పోటీల్లో ఈ సాయంత్రం ఐదు గంట‌ల‌కు జ‌రిగే మ్యాచ్‌లో స్పెయిన్, న్యూజిల్యాండ్‌తో, రాత్రి 7 గంట‌ల‌కు జ‌రిగే మ‌రో మ్యాచ్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్‌తో ఆడుతుంది.

భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న పురుషుల హాకీ ప్ర‌పంచ క‌ప్ పోటీల్లో  ఈ సాయంత్రం ఐదు గంట‌ల‌కు జ‌రిగే మ్యాచ్‌లో స్పెయిన్, న్యూజిల్యాండ్‌తో ఆడుతోంది. రాత్రి 7 గంట‌ల‌కు జ‌రిగే మ‌రో మ్యాచ్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్‌తో ఆడుతుంది. నిన్న సాయంత్రం జ‌రిగిన తొలి మ్యాచ్ లో జ‌ర్మ‌నీ, నెద‌ర్లాండ్స్ ను 4-1తో ఓడించింది. పాకిస్థాన్‌, మ‌లేషియాల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ 1-1 డ్రాగా ముగిసింది.