రాజ‌స్థాన్‌, తెలంగాణ రాష్ర్టాల్లో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం నిన్న సాయంత్రం ముగిసింది.

రాజ‌స్థాన్‌, తెలంగాణ రాష్ర్టాల్లో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం నిన్న సాయంత్రం ముగిసింది.  ఆ రెండు రాష్ర్టాల్లో పోలింగ్ శుక్ర‌వారం జ‌రుగుతుంది.  అన్ని పార్టీల అగ్ర నాయ‌కులు త‌మ అభ్య‌ర్థుల గెలుపు కోసం ఆ రాష్ర్టాల్లో విస్రృ్తంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. పోలింగ్ స్వేచ్ఛ‌గా నిర్వ‌హించ‌డానికి ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.  తెలంగాణ‌లో రాష్ర్ట వ్యాప్తంగా 32 వేల‌కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ర్టంలో 2.8 కోట్ల‌కు పైగా ఓట‌ర్లు ఉన్నారు. మొత్తం 119 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి 135 మ‌హిళ‌ల‌తో పాటు 1,821 మంది అభ్య‌ర్థులు  రంగంలో ఉన్నారు.

రాజ‌స్థాన్‌లో మొత్తం 200 శాస‌న‌స‌భ స్థానాల‌కు గాను, ఎన్నిక‌లు జ‌రుగుతున్న 199 స్థానాల నుంచి 189 మంది మ‌హిళ‌ల‌తో పాటు 2274 మంది అభ్య‌ర్థులు రంగంలో ఉన్నారు. బీఎస్పీ అభ్య‌ర్థి మ‌ర‌ణించ‌డం వ‌ల్ల అల్వార్ జిల్లాలో రామ్‌ఘ‌డ్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు వాయిదా వేశారు. చ‌త్తీష్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మిజోరాంల‌తో పాటు తెలంగాణ‌, రాజ‌స్థాన్‌ల ఓట్ల లెక్కింపు మంగ‌ళ‌వారం నిర్వ‌హిస్తారు.