వ్యక్తిగ‌త, గృహ‌, వాహ‌న మ‌రియు సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వాణిజ్య పారిశ్రామిక సంస్థ‌ల‌కు ఇచ్చే రుణాల‌పై చ‌లన వ‌డ్డీ రేట్లను రెపోరేటు వంటి వాటితో అనుసంధానించాల‌ని రిజ‌ర్వుబ్యాంక్ ప్ర‌తిపాదించింది.

ఎక్కువ పారదర్శకతను పాటించాలనే ఉద్దేశ్యంతో – వ్యక్తిగత, గృహ రుణాలను, MSME ల రుణాలను – రెపో రేటు లేదా ఖజానా రాబడి వంటి బాహ్య ప్రమాణాలతో అనుసంధానం చేసి – వాటిపై  చలన వడ్డీ రేట్లు – అమలు చేయాలని రిజర్వ్ బ్యాంకు ప్రతిపాదించింది.   ఈ మేరకు తుది విధి విధానాలను – ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు – నిన్న – ముంబాయి లో విడుదల చేసిన ప్రకటనలో – RBI – తెలిపింది.   ఈ కొత్త విధానం 2019 ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.   వీటిని – రుణాలు తీసుకున్న నాటి నుండి అమలు చేసి – ఋణ కాల పరిమితి పూర్తి అయ్యే వరకు కొనసాగించనున్నట్లు – RBI – పేర్కొంది.