రక్షణ పరికరాల ఆధునీకరణ ముఖ్యం : జైట్లీ

రక్షణ పరికరాలు, యంత్రాల ఆధునీకరణ ముఖ్యమైన అవసరమని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతోందని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ద్వైవార్షిక ఆర్మీ కమాండర్ల సదస్సులో జైట్లీ మాట్లాడుతూ.. ఆర్మీ ఎల్లప్పుడూ గొప్ప ప్రతిభ కనబరుస్తోందని, సవాళ్లకు తగ్గట్లుగా తమ వైఖరిని మార్చుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా మిలట్రీ ఉన్నతాధికారులను ఆయన అభినందించారు.

అన్ని వ్యవస్థలూ సక్రమంగా, బాగా పనిచేస్తున్నాయని, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు అభినందనీయులని ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపన్ రావత్ చెప్పారు. భారత ఆర్మీ తన పట్టును, వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు.