వర్కింగ్ జర్నలిస్టు చట్ట పరిధిలోకి టీవీ, డిజిటల్ మీడియాను తెచ్చేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం

వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులను తెచ్చేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.

కొచిలో జరిగిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్, డిజిటల్ జర్నలిస్టులను కూడా వర్కింగ్ జర్నలిస్టు చట్ట పరిధిలోకి తీసుకొచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్ట సవరణ చేస్తుందన్నారు. పత్రికా రంగంలో కార్మిక చట్టాలు, వేజ్ బోర్డు సిఫార్సులను అమలు చేసేందుకు తమ శాఖ చర్యలు చేపట్టిందని దత్తాత్రేయ చెప్పారు.