ఇటానగర్ లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

ఇటానగర్ లో ఒక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం వెంకయ్య నాయుడు చెప్పారు. గువాహటిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి తాత్కాలిక క్యాంపస్ లో ఈ సంస్థ కార్యకలాపాలు మొదలవుతాయని, తొలుత 10 వారాల స్వల్పకాలిక కోర్సుతో ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ సంస్థ కోసం రూ.200 కోట్లు పెట్టబడి పెట్టనున్నామని, దీనివల్ల ఈశాన్య ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. కోల్ కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ తరహాలో ఇది ఏర్పాటవుతుందని వివరించారు.