గ్రీస్ చేరిన భారత యుద్ధ నౌకలు

మూడు రోజుల పర్యటన నిమిత్తం నాలుగు భారత యుద్ద నౌకలు గ్రీస్ లోని సౌదా బే చేరుకున్నాయి.

భారత నేవీ ఓవర్సీస్ డిప్లాయ్ మెంట్ (ఓఎస్డీ)లో భాగంగా ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ త్రిశూల్, ఐఎన్ఎస్ తర్కాష్, ఐఎన్ఎస్ ఆదిత్యలు మధ్యదరా సముద్రం, ఆఫ్రికా పశ్చిమ తీరాలకు వెళ్లాయి. సోమవారం ఇవి సౌదా బే చేరుకున్నాయి.

ఆ దేశంలో ఉన్నంత సేపు ఈ యుద్ధ నౌకలు హెల్లనిక్ నేవీతో కలసి పనిచేస్తాయని భారత నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నాలుగు యుద్ధ నౌకలు ముంబై స్థావరంగా గల భారత పశ్చిమ నావల్ కమాండ్ కు చెందినవి.