లండన్ లో అరెస్టైన మాల్యా, బెయిలుపై విడుదల

పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించబడిన భారత వ్యాపారి విజయ్ మాల్యాను మంగళవారం స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు లండన్ లో అరెస్టు చేశారు. రుణాల ఎగవేత కేసుకు సంబంధించి మాల్యాను తమకు అప్పగించాలన్న భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ అరెస్టు జరిగిందని మెట్రోపాలిటన్ పోలీసు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
అయితే, విజయ్ మాల్యా వెస్ట్ మినిస్టర్స్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరై బెయిలు కోసం అభ్యర్థించగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మద్యం వ్యాపారి అయిన విజయ్ మాల్యా కింగ్ ఫిషన్ విమానాలకు సంబంధించి రూ.9 వేల కోట్లను వివిధ బ్యాకులకు ఎగ్గొట్టి 2016 మార్చి 2వ తేదీన భారత్ వదిలి పారిపోయారు.