ప్రతి భారతీయుడూ వీఐపీయే : ప్రధాని మోదీ

నవభారత స్ఫూర్తితో ఎర్రబుగ్గలకు కాలం చెల్లిందని, ఇప్పుడు ప్రతి భారతీయుడూ వీఐపీయేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

వాహనాలపై ఎర్రబుగ్గల వినియోగాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పలు ట్వీట్లకు మోదీ స్పందిస్తూ.. వీటిని ఇంతకు ముందే తొలగించాల్సిందని, ఇప్పటికైనా చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.