ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం రాత్రి బీజేపీ కోర్ గ్రూప్ భేటీ జరిగింది. దేశంలో రాజకీయ స్థితిగతులపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.

సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ఎం వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ భేటీలో పాల్గొన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్ర నాయకులైన ఎల్ కే అద్వానీ, ఎంఎం జోషి, ఉమా భారతిలకు వ్యతిరేకంగా నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ భేటీ జరగటం గమనార్హం.