బెంగళూరు సరస్సు పరిసరాల్లోని పరిశ్రమలు తక్షణం మూసేయండి : ఎన్జీటీ దేశం

బెంగళూరుకు చెందిన బెళ్లందూర్ సరస్సు చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు అన్నింటినీ తక్షణం పూర్తిగా మూసివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరస్సు వద్ద పేరుకున్న చెత్తకు నిప్పంటుకున్న సంగతి తెలిసిందే.

సరస్సు చుట్టుపక్కల ఘన వ్యర్థాలను, చెత్తను వేయరాదని ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కాగా, కార్పొరేషన్ నిర్లక్ష్యాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.

ఆయా పరిశ్రమల్లో వ్యర్థాలు అనుమతించిన స్థాయిల్లోనే ఉన్నాయని తేలే వరకూ పరిశ్రమల కార్యకలాపాలను ప్రారంభించకూడదని, జాయింట్ ఇన్ స్పెక్షన్ టీమ్ వీటిని పరిశీలిస్తుందని వివరించింది.

సరస్సు వద్ద ఎవరైనా చెత్త వేస్తుంటే వారిపై రూ.5 లక్షల పర్యావరణ జరిమానా విధించాలని ఆదేశించింది.