అరుణాచల్ ప్రాంతాల పేర్లు మార్చిన చైనా : అభ్యంతరం తెలిపిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ లోని ఆరు ప్రాంతాల పేర్లను చైనా మార్చింది. దీనిపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. పొరుగుదేశ రాష్ట్రాల్లోని పేర్లను మార్చినంత మాత్రాన అక్రమ చొరబాట్లు సక్రమం కాబోవని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బగ్లయ్ చెప్పారు. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని, అలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈశాన్య రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల అధికారిక పేర్లను ఖరారు చేసినట్లు చైనా బుధవారం ప్రకటించింది. దలైలామా ఆ రాష్ట్రంలో పర్యటించటం పట్ల భారత్ కు తమ నిరసన తెలిపిన చైనా, అనంతరం ఈ రెచ్చగొట్టే చర్య చేపట్టింది.