ఇండోనేషియాతో రక్షణ సంబంధాల బలోపేతానికి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హామీ

రక్షణ సంబంధాలను బలోపేతం చేసేందుకు, దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛగా నౌకాయానం జరిపేందుకు, తీవ్రవాదంపై పోరాడేందుకు సహకరిస్తామని ఇండోనేషియాకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హామీ ఇచ్చారు.

ఏషియా పసిఫిక్ ప్రాంతంలో నాలుగు దేశాల పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా, జపాన్ ల పర్యటన ముగించుకుని శుక్రవారం ఆయన జకార్తాలో ఇండేనేషియా అధ్యక్షుడు జోకో విడొడొతో భేటీ అయ్యారు. అనంతరం వారిరువురూ విలేకరులతో మాట్లాడారు.