ఈనెల 25 నుంచి 29 వరకు శ్రీలంక ప్రధాని భారత పర్యటన

శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే ఈనెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు భారతదేశంలో పర్యటించనున్నారు. 26వతేదీన విక్రమసింఘే గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. విదేశాంగ శాఖ మంత్రి, హోం శాఖ మంత్రి, రోడ్డు, రవాణా, నౌనాయాన శాఖల మంత్రులతో కూడా ఆయన భేటీ కానున్నారు.

ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల అనంతరం రాజధాని బయట పలు ప్రైవేటు కార్యక్రమాలకు విక్రమ సింఘే హాజరు కానున్నారు.