ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఎంపిక

ఛాంపియన్స్ ట్రోఫీలో తమ దేశం తరపున బరిలోకి దిగబోయే 15 మంది సభ్యుల జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. వీరిలో నలుగురు ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జేమ్స్ ప్యాటిన్ సన్, జోష్ హేజిల్ వుడ్, పాట్ కమ్మిన్స్ లకు చోటు లభించింది. అలాగే న్యూజిలాండ్ తో జరిగిన 2015 ప్రపంచ కప్ ఫైనల్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ కూడా ఈ జట్టులో ఉన్నాడు.