జకీర్ నాయక్ కు మరోమారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు

ఇస్లాం వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్ కు ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు మరోమారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద నాయక్ పై గతేడాది ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు జారీ చేసినప్పటికీ నాయక్ తమ ఎదుట హాజరు కాలేదని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. ఆయన్ను భారత్ కు తిరిగి రప్పించేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామని వెల్లడించింది.