నేపాల్: రాష్ట్రీయ జనతా పార్టీని స్థాపించిన ఐదు మధేస్ పార్టీలు

నేపాల్ లో ఐదు ప్రధాన మధేస్ పార్టీలు ఏకమై రాష్ట్రీయ జనతా పార్టీని స్థాపించాయి. ఐక్యతను పెంపొందించుకునేందుకు, తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ఏకమైనట్లు తారై మధేస్ లోకతాంత్రిక్ పార్టీ, సద్భావన పార్టీ, రాష్ట్రీయ మధేస్ సమాజ్ వాది పార్టీ, తారై మధేస్ సద్భావన పార్టీ, మధేసీ జనాధికార్ ఫోరం గణతాంత్రిక్ ఖాట్మండులో ప్రకటించాయి.

రాష్ట్రీయ జనతా పార్టీ ఎన్నికల చిహ్నం, జెండాను కూడా నాయకులు ఆవిష్కరించారు. తమతో కలవాలని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ మధేసి ఫోరం, సంఘీయ సమాజ్ వాదీ ఫోరం నేపాల్, నేపాల్ సద్భావన పార్టీలకు వారు పిలుపునిచ్చారు.