ప్రతిభ గల అధికారులకు ప్రధానమంత్రి అవార్డుల ప్రదానోత్సవం

పౌర సేవల దినోత్సవం సందర్భంగా ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ సత్కరించనున్నారు.

వివిధ పథకాలను, ఆవిష్కరణలను సమర్థవంతంగా అమలు చేసిన జిల్లా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులకు ప్రధానమంతిర అవార్డులను నరేంద్ర మోదీ ప్రదానం చేయనున్నారు.

11వ పౌర సేవల దినోత్సవ వేడుకలను గురువారం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.