రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదాం : సోనియాను కలిసిన బీహార్ సీఎం నితీశ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ గురువారం న్యూఢిల్లీలో కలిశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదామని ఆయన ప్రతిపాదించారు.

అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకురాలైన సోనియాగాంధీ ఈ అంశంపై చొరవ తీసుకోవాలని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే వామపక్ష పార్టీల నాయకులతో నితీశ్ కుమార్ మాట్లాడారని త్యాగి తెలిపారు.

2015లో బీహార్ లో మహాకూటమిని ఏర్పాటు చేసినట్లుగానే ఇప్పుడు సెక్యులర్ పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలని నితీశ్ కుమార్ భావిస్తున్నట్లు త్యాగి చెప్పారు.