3వ స్థానానికి చేరిన పీవీ సింధు

బీడ్ల్యుఎఫ్ గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఐదుగురు భారత షట్లర్లు తమ ర్యాంకుల్ని మెరుగుపర్చుకున్నారు. రియో ఒలంపిక్స్ వెండి పతక విజేత పీవీ సింధు 3వ ర్యాంకుకు చేరింది. గత వారం ఐదో స్థానంలో నిలిచిన సింధు తాజాగా ముగిసిన సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ లో క్వార్టర్స్ కు చేరటం ద్వారా మరో రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది.

సైనా నెహ్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 8వ స్థానంలో నిలిచింది.

పురుషుల సింగిల్స్ లో అజయ్ జయరామ్ 13వ స్థానానికి చేరి భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ పొందారు.

కిడంబి శ్రీకాంత్ 21వ స్థానంలోను, బి సాయి ప్రణీత్ 21వ స్థానంలోనూ నిలిచారు. వీరిద్దరూ ఎనిమిదేసి స్థానాలు మెరుగుపర్చుకున్నారు