జాదవ్ కేసు వాదించేందుకు రూ.1 తీసుకున్న హరీశ్ సాల్వే : సుష్మా స్వరాజ్

కులభూషణ్ జాదవ్ కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది హరీశ్ సాల్వే ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్నారు.

ఒక కేసును వాదించేందుకు సాల్వే తీసుకునే ఫీజు కంటే తక్కువకు మరెవరైనా మంచి న్యాయవాదిని భారతదేశం ఎంచుకుని ఉండాల్సిందంటూ వచ్చిన ట్వీట్ కు సుష్మా స్వరాజ్ స్పందిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.