ట్రిపుల్ తలాఖ్ ను కొట్టేస్తే చట్టం చేస్తాం : సుప్రీంకు తెలిపిన అటార్నీ జనరల్

ట్రిపుల్ తలాఖ్ చెల్లుబాటు కాదని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కనుక స్పష్టం చేస్తే ముస్లింల్లో వివాహం, విడాకులను నియంత్రించేందుకు చట్టం చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ట్రిపుల్ తలాఖ్ కేసుపై విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సోమవారం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ విషయాన్ని వెల్లడించారు.