విపత్తు ప్రాంతాల్లో నివశిస్తున్న సగం జనాభా : రాజ్ నాథ్ సింగ్

మన దేశంలో సగానికి పైగా జనాభా భూకంపాలు, వరదలు, తుపానులు, కరువు, సునామీ తదితర విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లోనే నివశిస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక రెండో సమావేశం సోమవారం న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణ చర్యలను పాటించటం కీలకమని, విపత్తులను తట్టుకునే వ్యవస్థీకృత యంత్రాంగాలు భారత్ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు.

వివిధ భాగస్వామ్య పక్షాలతో కలసి విపత్తు ముప్పును తగ్గించేందుకు, సమర్థవంతగా పనిచేసేందుకు ఒక జాతీయ వేదికను ఏర్పాటు చేశామన్నారు.