సింగపూర్ లో అంతర్జాతీయ నౌకాయాన సదస్సుకు హాజరైన అడ్మిరల్ సునీల్ లంబ

సింగపూర్ లోని ప్రఖ్యాత ఛాంగి నావల్ బేస్ లో సోమవారం ప్రారంభమైన మొదటి సింగపూర్ అంతర్జాతీయ నౌకాయాన సదస్సుకు భారత నౌకాదళ ఛీఫ్ అడ్మిరల్ సునిల్ లంబ హాజరయ్యారు.

ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కమోర్టా నౌకాదళ నౌకలతో పాటుగా అడ్మిరల్ లంబ ఈ సదస్సుకు వెళ్లారు. 28 దేశాలకు చెందిన 46 యుద్ధ నౌకలు దీనికి హాజరయ్యాయి. సింగపూర్ దేశ నౌకాదళం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నారు.