ఆపరేషన్ క్లీన్ మనీ వెబ్ సైట్ ప్రారంభించిన ప్రభుత్వం

పెద్దనోట్ల రద్దు తర్వాల ఆదాయపు పన్ను రిటర్నులు, పన్ను ఆదాయం పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

మంగళవారం న్యూఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఆపరేషన్ క్లీన్ మనీ వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించారు. పన్నును ఎగవేయటం ఏమాత్రం క్షేమకరం కాదని, అలాంటివన్నీ ఇక సులభంగా గుర్తించవచ్చునని జైట్లీ చెప్పారు.

గతేడాది నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ మధ్య నగదు లావాదేవీలు నిర్వహించిన 18 లక్షల మంది పన్ను చెల్లింపుదారులను గుర్తించామని, వీరి ఆదాయానికీ, నగదు లావాదేవీలకు మధ్య పొంత లేదని తేలిందన్నారు. 91 లక్షల ఆదాయపు పన్ను రిటర్నులు కూడా పెరిగాయని, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కూడా పెరిగారన్నారు.