కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ ప్లాన్ తయారీలో జాప్యంపై ఎన్జీటీ ఆగ్రహం

సముద్రతీరంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ ప్లాన్ (సీజెడ్ఎంపీ)ని తయారు చేయటంలో జాప్యం పట్ల కేంద్ర పర్యావరణ, అటవీ శాఖపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అధికారులు కేంద్ర, రాష్ట్రాలను నిందిస్తూ బాధ్యతలను విస్మరిస్తున్నారని ట్రిబ్యునల్ తెలిపింది.

ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని పర్యావరణ శాఖలోని సంబంధిత సంయుక్త కార్యదర్శిని ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంత్రకుమార్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది.