ట్రిపుల్ తలాఖ్ 1400 ఏళ్ల విశ్వాసం : సుప్రీంకోర్టుకు తెలిపిన ముస్లిం బోర్డు

ట్రిపుల్ తలాఖ్ అనేది ముస్లింలు 1400 ఏళ్లుగా విశ్వసిస్తున్న ఆచారమని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. కాబట్టి, దీనికి రాజ్యాంగ నైతికత, సమానత్వం అనే ప్రశ్నలు తలెత్తవని వివరించింది.

బోర్డు తరపున కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విచారణకు హాజరయ్యారు. అయోధ్యలోనే హిందూ దేవుడైన రాముడు జన్మించాడనే విశ్వాసంతో ట్రిపుల్ తలాఖ్ ను ఆయన సరిపోల్చారు.

ప్రొఫెట్ ముహమ్మద్ తదనంతర కాలంలో ట్రిపుల్ తలాఖ్ అమల్లకి వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ తో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట సిబల్ వాదనలు వినిపించారు.