కులభూషణ్ జాదవ్ కేసుపై నేడు ఐసీజే తీర్పు

కులభూషణ్ జాదవ్ కేసులో హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తీర్పు వెలువరించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

సోమవారం భారతదేశం తన వాదనలు వినిపించగా, పాకిస్తాన్ సైతం వాదనలు వినిపించింది.

భారత పౌరుడు కులభూషణ్ జాదవ్ కు పాక్ సైనిక న్యాయస్థానం మరణ శిక్ష విధించటం వియన్నా కన్వెన్షన్ తీర్మానాలకు విరుద్ధమని భారత్ వాదించింది.