మాతృత్వ లబ్ధి పథకానికి కేబినెట్ ఆమోదం

మాతృత్వ లబ్ధి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించింది.

మొదటి బిడ్డకు మాత్రమే ఇది వర్తిస్తుంది. బిడ్డను ప్రసవించే ముందు, తర్వాత తగినంత విశ్రాంతి పొందేలా, పౌష్టికాహారం స్వీకరించేలా ఉద్యోగినికి అవకాశం కల్పించటంతో పాటు కోల్పోయిన పనిదినాలకు తగిన నగదు రాయితీలను ఇచ్చేలా ఈ మాతృత్వ లబ్ధి పథకాన్ని రూపొందించారు.