ఆఫ్రికన్ డెవలప్ మెంట్ బ్యాంకు వార్షిక భేటీ ప్రారంభించనున్న మోదీ

ఆఫ్రికన్ డెవలప్ మెంట్ బ్యాంకు వార్షికోత్సవ సదస్సును ఈనెల 23వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

ఏఎఫ్ డీబీ గ్రూపు చరిత్రలో వార్షిక సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వటం ఇదే తొలిసారి అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ న్యూఢిల్లీలో విలేకరులకు తెలిపారు.

ఈనెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఈ భేటీ జరుగనుంది. 81 సభ్య దేశాల నుంచి 3 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు.