ఇరాన్ 12వ అధ్యక్ష ఎన్నికలు నేడు

ఇరాన్ లో 12వ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ నేడు జరుగనుంది. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు హస్సన్ రౌహని, ఇబ్రహీం రైసిల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

అధ్యక్ష ఎన్నికలతో పాటు కొన్ని నియోజకవర్గాలకు పార్లమెంటరీ మధ్యంతర ఎన్నికలు, ఇస్లామిక్ సిటీ, గ్రామ మండళ్ల స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈరోజే జరుగనున్నాయి.