ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ నేడు

ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య శుక్రవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది.

ఈ మ్యాచ్ లో గెలుపొందిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో రైజింగ్ పూణే సూపర్ గెయింట్ జట్టుతో తలపడుతుంది.

బుధవారం జరిగిన లిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా జట్టు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై గెలుపొందింది.