ఐసీజే తీర్పు పాక్ న్యాయ వ్యవస్థపై తీవ్ర నేరారోపణ : జైట్లీ

కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు పాకిస్తాన్ న్యాయ వ్యవస్థపై తీవ్రమైన నేరారోపణ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

శ్రీనగర్ లో జరుగుతున్న రెండు రోజుల జీఎస్టీ మండలి సదస్సుకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హేగ్ లని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు భారత వాదనను బలపర్చిందన్నారు.

రహస్యంగా, ప్రజలకు అందుబాటులో లేకుండా, పారదర్శకత లేకుండా నిర్వహించిన న్యాయ విచారణలో న్యాయం ఉండదని పాకిస్తానీ సైనిక న్యాయస్థానం విచారణను ఉద్దేశించి జైట్లీ అన్నారు.