ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ కు అంపైరింగ్ చేయనున్న ఎస్ రవి

ఇంగ్లండ్ లో జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో భారతదేశానికి చెందిన సుందరం రవి ఫీల్డ్ అంపైర్లలో ఒకడిగా విధులు నిర్వర్తించనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అంపైర్లు, రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి గురువారం ప్రకటించింది.

క్రిస్ బ్రాడ్, డేవిడ్ బూన్, ఆండీ పైక్రాఫ్ట్ లు ఎలైట్ ప్యానెల్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. మొత్తం 12 మంది అంపైర్లుగా వ్యవహరించనున్నారు.