ట్రిపుల్ తలాఖ్ పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

పాపమైన, చెడ్డదైన ట్రిపుల్ తలాఖ్ ను విశ్వాసంగా ఎలా అమలు చేస్తారని ముస్లిం సంఘాలను సుప్రీంకోర్టు అడిగింది.

ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆలిండియా ముస్లిం ఉమెమ్ పర్సనల్ లా బోర్డు తదితర భాగస్వామ్య పక్షాల వాదనలను గత ఆరు రోజులుగా ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ సింగ్ ఖేహర్ తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విన్నది. గురువారం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

వేసవి సెలవుల్లో కూడా ఆరు రోజుల పాటు ఏకధాటిగా వాదనలు వినిపించి, తమకు సహకరించినందుకు గాను ఆయా వర్గాల న్యాయవాదులకు ధర్మాసనం కృతజ్ఞతలు తెలిపింది.