ఢొల-సదియా వంతెనను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ

అస్సాంలోని ఢొల-సదియా వంతెనను ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జి ఇదని, దీని పొడవు 9.16 కిలోమీటర్లని అస్సాం ప్రజా పనుల శాఖ మంత్రి పరిమల్ శుక్లా బింద్య తెలిపారు.

రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ల మధ్య రవాణాకు, ప్రజల సంబంధాలకు ఊతమిస్తుందని చెప్పారు.