భారత్ లో స్మార్ట్ సిటీలపై స్వీడన్ ఆసక్తి

స్మార్ట్ సిటీల అభివృద్ధిపై స్వీడన్ ఆసక్తి చూపించింది. స్మార్ట్ సిటీల్లో పర్యావరణ హితమైన రవాణా పరిష్కారాలు, ఘన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించేందుకు తమ అనుభవం, సాంకేతికతను ఉపయోగించేందుకు అవసరమైన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ముందుకొచ్చింది.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో స్వీడన్ కు చెందిన యురోపియన్ యూనియన్ వ్యవహారాల శాఖ మంత్రి అన్ లిండే గురువారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిలో సహకారంపై వీరు చర్చలు జరిపారు.

స్మార్ట్ సిటీల అభివృద్ధికి సంబంధించి 2015లోనే అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నామని, దీని ద్వారా తమ దేశానికి గొప్ప అవకాశాలు లభించనున్నాయని ఆమె తెలిపింది.