భారత సైన్యం చేతికి రెండు ఎం777 ఎ2 అల్ట్రా లైట్ హోవిట్జర్లు

రెండు ఎం777 ఎ2 అల్ట్రా లైట్ హోవిట్జర్లు గురువారం భారత సైన్యం చేతికి అందాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించే ముందు పరీక్షలు నిర్వహించనున్నారు.

వివిధ రకాల లక్ష్యాలు, పేలుడు పదార్థాలతో కూడిన పలు పరీక్షలను ఏడాది పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షల సందర్భంగా గన్నులు 155 ఎంఎం దేశీయ పేలుడు పదార్థాలను పేల్చనున్నాయి.

దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత సైన్యం చేతికి అందిన శతఘ్నులివి. చివరిసారిగా 80వ దశకంలో స్వీడన్ కు చెందిన భోఫోర్స్ శతఘ్నులు వచ్చాయి.