రష్యా విచారణకు నేతృత్వం వహించనున్న ఎఫ్ బీఐ మాజీ డైరెక్టర్

అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందని, ట్రంప్ ప్రచారానికి మద్దతు ఇచ్చిందంటూ వెలువడిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కౌన్సెల్ గా ఎఫ్ బీఐ మాజీ ఛీఫ్ రాబర్ట్ ముల్లెర్ నియమితులయ్యారు.

ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన ఈ విచారణను బయటి వ్యక్తులు చేస్తేనే మంచిదని, కాబట్టే రాబర్ట్ ముల్లెర్ ను నియమించామని, ఈ నియామకానికి ఇరు రాజకీయ పక్షాలూ అంగీకరించాయని డిప్యూటీ అటార్నీ జనరల్ తెలిపారు.