రూ.100 కోట్ల మాల్యా ఆస్తిని జప్తు చేసిన ఈడీ

మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన మహారాష్ట్ర లోని రాయగఢ్ జిల్లా అలీభాగ్ లో ఉన్న రూ.100 కోట్ల విలువైన ఫార్మ్ హౌస్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.

17 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆస్తిని గతేడాది సెప్టెంబర్ లోనే ఈడీ తాత్కాలిక జప్తు చేయగా.. దీన్ని ఖాళీ చేసేందుకు తమకు సమయం ఇవ్వాలని యజమానులు కోరారు. కానీ, సంబంధిత అప్పీలేట్ సంస్థ ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది.