ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన సుందర్ సింగ్

ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో విభాగంలో సుందర్ సింగ్ గుర్జార్ బంగారు పతకం గెలిచారు. లండన్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో సుందర్ సింగ్ శనివారం జరిగిన గేమ్‌లో పతకం కైవసం చేసుకున్నాడు.

సాంకేతిక కారణాలతో 2016లో రియోలో జరిగిన క్రీడల్లో అనర్హత వేటుకు గురైన సుందర్ ఈ సారి ఏకంగా స్వర్ణ పతకం గెలిచి సత్తా చాటాడు.

పతకం గెలిచిన అనంతరం సుందర్ మాట్లాడుతూ ఈ గెలుపు తనకు ఎంతో విశ్వాసాన్ని ఇచ్చిందనీ, ఇది తనకు భవిష్యత్తులో మరింత స్పూర్తి దాయకంగా ఉంటుందని అన్నారు.