అవినీతి రాజకీయ నాయకులపై చర్యలు తప్పవు- ప్రధాని మోది

వర్షకాల సమావేశాలు జరగనున్న సందర్భంగా అఖిల పక్ష సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని ప్రసంగించారు. తమ మీద వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ తమని తాము కాపాడుకోవాలని చూసే వారిపై సమిష్టిగా పోరాడాలన్నారు.

అవినీతికి పాల్పడ్డ రాజకీయనాయకులపై తప్పనిసరిగ  చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రాజకీయనాయకుడిపై అవినీతి మచ్చ ఉందనుకోవద్దని నాయకులు ప్రజలకు తెలియజెప్పాలని  ఈ సందర్భంగా మోది అభిప్రాయపడ్డారు.