ఆచూకి తెలియని భారతీయులు ఇరాక్‌లోని బదుష్ జైలులో ఉండొచ్చు- సుష్మా స్వరాజ్

ఇరాక్‌లో 2014 నుంచి కనపడకుండా పోయిన 39 భారతీయులు బదూష్ జైలులో బంధీలుగా ఉండి ఉండవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, సహాయమంత్రులు ఎంజె అక్బర్, వికె సింగులు అభిప్రాయపడ్డారు. ఆచూకి కనపడకుండా పోయిన భారతీయులకు సంబంధించిన కుటుంబాలను ఆదివారం సుష్మా స్వరాజ్, ఇద్దరు సహాయమంత్రులు పరామర్శించారు.

ఆచూకీ తెలియకుండా పోయిన భారతీయుల సమాచారాన్ని తెలుసుకోవడానికి గత కొన్ని రోజుల క్రితం వికె సింగ్ ఇరాక్ సందర్శించి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలను వీరు కలిశారు.

ఐఎస్ ఐఎస్ చేతుల నుంచి మోసుల్ స్వేచ్ఛపొందిందని ఇరాక్ ప్రధాని ప్రకటించిన తర్వాతే సింగ్ ఇర్బిల్ వెళ్లినట్టు సుష్మా తెలిపారు. కనిపించకుండా పోయిన భారతీయులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తీసుకెళ్లి ఉంటారని తొలుత భావించారు.