ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నేడు ప్రకటించనున్న బిజెపి

నేడు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బిజెపి ప్రకటించనుంది.  ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు నేటి సాయంత్రం న్యూఢిల్లిలో సమావేశం కానుంది.

పశ్చిమబెంగాల్‌కు చెందిన మాజి గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధిని ప్రతిపక్షాలు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఉపరాష్టపతి పదవికి దరఖాస్తులు పెట్టుకోవడానికి ఆఖరు తేది రేపే. అభ్యర్థుల దరఖాస్తులను బుధవారం పరిశీలిస్తారు. దరఖాస్తుల ఉపసంహరణకు ఈ నెల 21 ఆఖరు రోజు.