ఖతార్, అరబ్ దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై అంతర్జాతీయ పర్యవేక్షణ అవసరం : యుఎఈ అధికారి

ఖతార్, అరబ్ దేశాల నడుమ నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో అంతర్జాతీయ సమాజం పర్యవేక్షణ నిర్వహించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

కాగా, దోహాపై ఒత్తిడి ఫలితాలను ఇస్తోందనీ, వాతావరణంలో మార్పు కనిపిస్తుందన్నారు.

గత నెల 5వ తేదీ నుంచి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు ఖతార్ మీద కొన్ని ఆంక్షలు విధించాయి.

ఖతార్‌తో దౌత్య సంబంధాలతోపాటు రవాణా సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. ఖతార్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఆ దేశంపై గల్ప్ దేశాలు ఖఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.