గోరక్షణ పేరుతో జరుగుతన్న దౌర్జన్యాలను అడ్డుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని సూచన

 

గోరక్షణ పేరుతో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోది అన్నారు. అలాంటి సంఘ వ్యతిరేక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు.

గోవులను సంరక్షించడానికి చట్టాలు ఉన్నాయని, కానీ చట్టాలను చేతుల్లోకి తీసుకోవానుకోవడం సరికాదని హెచ్చరించారు. ఇలాంటి అంశాలకు రాజకీయ, మతసంబంధమైన రంగును పులమాలని చూస్తున్నారని విమర్శించారు. అవినీతిపై కలసికట్టుగా పోరాడాలని రాజకీయపక్షాలకు ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు.

దేశమంతటా జిఎస్టీ అమలు విజయవంతంగా జరగడంలో అన్ని రాజకీయపక్షాలు ఎంతో సహకారాన్ని అందజేశాయన్నారు. వర్షాకాల సమావేశాలు  నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు విజయవంతంగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి అనంత కుమార్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏర్పాటుచేపసిన అఖిలపక్ష సమావేశాల విశేషాలను మీడియాకు తెలియజేశారు. అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం తరపున పాల్గొన్న వారిలో మంత్రి అనంతకుమార్‌తో పాటు అరుణ్ జైట్లీ తదితరులు కూడా ఉన్నారు.

సమావేశానికి ముందు కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్డాడుతూ కశ్మీర్‌, చైనాకు సంబంధించిన అంశాలపై చర్చించాలని కోరినట్టు మీడియాకు తెలిపారు.

సిపి ఐ (ఎం) నాయకులు సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఈ సమావేశాల్లో మహిళా బిల్లును చేపట్టాలని కోరారు.