జాదవ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాల పరిశీలనలో పాక్ సైన్యం

పాక్  సైనిక న్యాయస్థానం కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జాదవ్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే జాదవ్ చేసుకున్న విజ్ఘప్తిని మెరిట్ ప్రకారం  నిర్ణయిస్తారు. గత నెల జనరల్ బాజ్వాకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా జాదవ్ దరఖాస్తును పెట్టుకున్నారు. గూఢచర్యానికి, ఉగ్రవాద చర్యలకు జావెద్ పాల్పడినట్టు ఆరోపణలు ఉండడంతో పాక్ సైనిక న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత్ అభ్యర్థన మేరకు హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ జాదవ్ ఉరిశిక్షను మేలో ఆపింది.