నేడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ : కొత్త పన్ను విధానం అమలుపై సమీక్ష

న్యూఢిల్లో నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కొత్తగా ప్రవేశపెట్టి వస్తు, సేవల పన్ను అమలు విధానం ఎలా ఉందో సమీక్షించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

జీఎస్టీ అమలులోకి వచ్చి రెండు వారాలు అవుతున్న సందర్భంగా ఈ సమీక్ష ఏర్పాటు చేశారు.

ఈ నెల 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన అనంతరం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కావడం ఇదే తొలిసారి.

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగే సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది.