నేపాల్ నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ ప్రసాద్ పరాజులి

నేపాల్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గోపాల్ ప్రసాద్ పరాజలి నియమితులయ్యారు. పార్లమెంటరీ హియరింగ్ స్పెషల్ కమిటి (పిహెచ్ఎస్‌సి) జస్టిస్ గోపాల్ పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. నేపాల్ న్యాయవ్యవస్థ అధిపతిగా జస్టిస్ గోపాల్ 2018, ఏప్రిల్ 28 వరకూ కొనసాగుతారు.

జస్టిస్ గోపాల్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గోపాల్ సుప్రీంకోర్టులో బాగా సీనియర్ జడ్జి.సుశీలా కార్కి ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినప్పటి నుంచి జస్టిస్ గోపాల్ అధికారిక యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు.